Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎన్బికె108 అభిమానులు, కుటుంబ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.
ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ మాస్, అనిల్ రావిపూడి మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఉగాది కానుకగా బాలకష్ణ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసి అందరికి మాస్ ఫీస్ట్ అందించారు మేకర్స్. బాలకష్ణ రెండు విభిన్నమైన అవతారాల్లో కనిపిస్తున్న రెండు పోస్టర్లను రిలీజ్ చేశారు. రెండు పోస్టర్లలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని గెటప్‌లలో కనిపిస్తున్నారు. అంతేకాదు వీటిపై 'ఈసారి మీ ఊహలకు మించి..' అంటూ క్యాప్షన్ ఉండటం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో బాలకష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది.