Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో విశ్వక్ సేన్ నటించిన కొత్త సినిమా 'దాస్ కా ధమ్కీ'. ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత కూడా ఆయనే. ఉగాది కానుకగా విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మంచి ఓపెనింగ్స్‌తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్సేన్ మీడియాతో మాట్లాడుతూ, 'మేం అనుకున్నదాని కంటే పెద్ద సక్సెస్ అయ్యింది. దాదాపు 8 కోట్ల 88లక్షలు. నా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఫస్ట్ హాఫ్‌ని హిలేరియస్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. నివేదా పేతురాజ్‌ని చాలా కొత్తగా చూపించారని ప్రశంసలు రావడం హ్యాపీగా ఉంది. ఇక నటుడిగా నేను చేసిన ద్విపాత్రాభినయానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఏప్రిల్ 14న హిందీలో రిలీజ్ చేస్తాం. తర్వాత మలయాళంలోనూ విడుదల చేయాలనుకుంటున్నాం. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుంది. ప్రస్తుతం సితార, రామ్ తాళ్లూరి, నా సొంత ప్రొడక్షన్లో సినిమాలు ఉన్నాయి. 'గామి' త్వరలోనే రిలీజ్ ఉంటుంది' అని చెప్పారు.