Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక ప్రేమకథా చిత్రం 'శాకుంతలం'. సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రీడీ టెక్నాలజీతో విజువల్ వండర్‌గా తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాలో సమంత, దేవ్ మోహన్ లుక్‌ను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా డిజైన్ చేశారు. వీటి గురించి గుణశేఖర్ మాట్లాడుతూ, ''దానవీరశూరకర్ణ'లో ఎన్టీఆర్ నిజమైన నగలు ధరించారు. ఆ స్ఫూర్తితో మేం ఈ సినిమాలో సమంతతోపాటు ఇతర ముఖ్యమైనపాత్రలన్నింటికీ రూ.14 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలను ఉపయోగించాం. దాదాపు 15 కిలోల ఒరిజినల్ బంగారంతో చేసిన సినిమా మన దేశంలోనే మొదటిది. వసుంధర జువెలర్స్ మాతో అసోసియేట్ అయ్యింది. నేహా, నీతాలుల్లా డిజైన్ చేసిన జ్యువెలరీని వేసుకునేందుకు నటీనటులందరూ చాలా ఎగ్జైట్మెంట్తో షూటింగ్‌కి వచ్చేవారు. 'శాకుంతలం' అనగానే వనంలో కనిపించేదే కాదు, రాచరికంలో ఉన్న వైభవాన్ని కూడా చూసి ఆస్వాదిస్తారు' అని చెప్పారు.