Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ఎన్టీఆర్ 30 గురువారం ఆరంభమైంది. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలి నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌పై చిత్రీకరిం చిన ముహూర్తపు షాట్‌కు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి క్లాప్ కొట్టగా, కొరటాల శివ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రశాంత్ నీల్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి యూనిట్‌కి స్క్రిప్ట్‌ను అందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ,'విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. ఈ కథలో మనుషుల కన్నా ఎక్కువ మృగాళ్ళు ఉంటారు. భయమంటే ఏంటో తెలియని మృగాళ్ళు. దేవుడంటే భయం లేదు. చావంటే భయం లేదు. కానీ, ఒకే ఒకటంటే వాళ్ళకి భయం. ఆ భయమేంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. భయం ఉండాలి. భయం అవసరం. భయపెట్టడానికి ఈ సినిమాలో నా ప్రధాన పాత్ర ఏ రేంజ్‌కి వెళ్తుందనేది ఎమోషనల్ రైడ్. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 5, 2024న రిలీజ్ చేస్తాం' అని తెలిపారు.