Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో శుక్రవారం విద్యార్థినిలకు ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఆయుష్ వైద్యాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థినీలు కౌమార దశలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పదవ తరగతి విద్యార్థినిలకు న్యూట్రిషన్ కిట్లను, కళాశాల విద్యార్థులకు రాగి లడ్డూలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సింలు యాదవ్, డాక్టర్ కీర్తన, డాక్టర్ చైతన్య, ఫార్మసిస్టులు గోపాలకృష్ణ, శ్రీనివాస్ గౌడ్, మహముద్ బేగ్, కళాశాల స్పెషల్ ఆఫీసర్ హరిప్రియ, పంచాయతీ కార్యదర్శి బాబు, విద్యార్థినీలు పాల్గొన్నారు.