Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వి శ్రీనివాస్ ఆర్ట్ క్రియేషన్స్, త్రిదేవ్ క్రియేషన్స్ పతాకాలపై బాబు నిమ్మగడ్డ దర్శకత్వంలో ఎదుబాటి కొండయ్య నిర్మిస్తున్న చిత్రం 'సత్యం వధ ధర్మం చెర'. ఈనెల 31న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ, 'మన నిజజీవితంలో ప్రతిరోజూ జరిగే సంఘటనలే ఈ చిత్రకథ. అలాగే చట్టం ఎలా పనిచేయాలో ఇందులో చూపించాం. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమా చాలా బాగా వచ్చింది' అని తెలిపారు. 'ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు'అని హీరోయిన్ పూజ అన్నారు.'మంచి కాన్సెప్ట్‌తో నిర్మించాం'అని నిర్మాత చెప్పారు.