Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జి ఎల్ బి సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం 'దుమారం'. ఉగాది పండుగ నేపథ్యంలో శ్రీనగర్ కాలనీలోని సంధ్య మోషన్ స్టూడియోస్‌లో స్క్రిప్ట్ పూజ జరిగింది.ఒక మారుమూల గ్రామం నుండి హైదరాబాద్‌కి వచ్చిన ఒక నాయిని బ్రాహ్మణ కుర్రాడు కటింగ్ షాపుతో జీవనం కొనసాగి స్తుంటాడు. ఓసారి అనుకోని సంఘటన వల్ల నగరంలోని ఒక మాఫియా వాళ్లతో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ సినిమా. హీరోగా మల్లిక్ బాబు, హీరోయిన్గా ఇషాని పరిచయం చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది.