Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ నటిస్తున్న కొత్త సినిమా 'రావణాసుర'. సుధీర్ వర్మ దర్శకుడు. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రచయిత శ్రీకాంత్ విస్సా మీడియాతో మాట్లాడుతూ, 'ఇదొక యాక్షన్ థ్రిల్లర్. రవితేజ సినిమాలో ఉండే అంశాలన్నీ ఉంటూనే ఒక డిఫరెంట్ ఎలిమెంట్ సర్ప్రైజ్ చేస్తుంది. 'హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్' అంటే హీరోలు అనే వాళ్ళే ఉండరని అర్ధం. ప్రతి హీరోలో ఒక విలన్ ఉంటాడు. ప్రతి విలన్‌లోనూ హీరో ఉంటాడు. అదే కాన్సెప్ట్. దర్శకుడు సుధీర్ వర్మతో పని చేయడం కంఫర్ట్ బుల్గా ఉంటుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ 'డెవిల్', 'టైగర్ నాగేశ్వరరావు', 'పుష్ప 2' కోసం వర్క్ చేస్తున్నా' అని తెలిపారు.