Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఓ మంచి సినిమా తీస్తే ట్రెండ్‌కి భిన్నమైనా సరే కచ్చితంగా బ్రహ్మరథం పడతారనే నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. 'రంగమార్తాండ'కి మంచి ఆదరణ లభించడం ఆనందంగా ఉంది' అని దర్శకుడు కృష్ణవంశీ చెప్పారు. ఆయన దర్శకత్వం వహించిన 'రంగమార్తాండ' విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, 'కుటుంబం బాగుంటేనే, దేశం బాగుంటుంది అనే కాన్సెప్ట్ నచ్చి 'నట సామ్రాట్'ని రీమేక్ చేశా. డబ్బు సంపాదన, ఉద్యోగాల్లో పడి మన సొంత కుటుంబాన్నే నిర్లక్ష్యం చేస్తున్నాం. అలా చేస్తే ఏం జరుగుతుంది అనేదే మా సినిమా. బ్రహ్మానందం, ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ నటనకి మంత్రముగ్ధులవుతున్నారు. అలాగే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అమ్మానాన్నల్ని గుర్తు చేసుకుంటున్నారు' అని అన్నారు.