Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రముఖ గాయకుడు ఘంటసాల, మా నాన్నగారు అల్లు రామలింగయ్య, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావుల శతజయంతి ఉత్సవాలను మే 26, 27, 28 తేదీల్లో న్యూజెర్సీలో అంతరూ గర్వపడేలా, ఎంతో ఘనంగా చేయటానికి నాట్స్ ( ఉత్తర అమెరికా తెలుగు సమితి) రంగం సిద్ధం చేసింది' అని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. దీని గురించినాట్స్ అధ్యక్షుడు బాపు నూతి మాట్లాడుతూ,'ఈ ఏడాది ఉత్తర అమెరికా తెలుగు సంబురాలలో భాగంగా మన తెలుగు పెద్దల శత జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవటానికి భారీఎత్తున ప్లాన్ చేశాం. తెలుగు సినిమా పరిశ్రమ నుండి అతిరథ మహారధులు ఎంతో మంది న్యూజెర్సీలో జరిగే వేడుకల్లో పాల్గొంటున్నారు' అని అన్నారు. జయసుధ, సాయికుమార్, అలీ, చంద్రబోస్ తదితరులు సైతం ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అన్నారు.