Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'రావణాసుర'. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం సంగీతం అందించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ, 'అభిషేక్‌గారి ప్రొడక్షన్లోనే 'డెవిల్' చేస్తున్నాను. ఆయన ఒక రోజు కాల్ చేసి 'రావణాసుర' టైటిల్ ఎలా ఉందని అడిగితే, చాలా పవర్ ఫుల్‌గా ఉందన్నాను. దీనికి థీమ్ సాంగ్ కావాలని కొన్ని వివరాలు చెప్పారు. ఒక ట్యూన్ చేసి పంపించాను. అది ఆయనతోపాటు దర్శకుడు సుధీర్‌వర్మకి నచ్చి ఈ చిత్రానికి నువ్వే మ్యూజిక్ చేస్తున్నావని, ఇందులో రవితేజ హీరో అని చెప్పి డబుల్ సర్ప్రైజ్ ఇచ్చారు. రవితేజతో పని చేయడం డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. నేను నాలుగు పాటలుతో పాటు నేపధ్య సంగీతం చేస్తే, భీమ్స్ ఒక ఐటెం సాంగ్ చేశారు. దర్శకుడు సుధీర్‌వర్మ సౌండింగ్ కొత్తగా ఉండాలని చెప్పడంతో చాలా ఛాలెజింగ్‌గా అనిపించింది. 'రావణాసుర' సరికొత్త కథతో ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుంది' అని తెలిపారు.