Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బతుకమ్మ పండగ నేపథ్యం లోని పాటలు మన తెలుగు సినిమాల్లో తరచూ వినిపించడం అనేది మామూలే. అయితే బాలీవుడ్ సినిమాలో బతుకమ్మ పాట వినబడితే... విశేషమే కదా! సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన బాలీవుడ్ సినిమా 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్'. ఆయన సరసన పూజాహొహెగ్డే కథానాయికగా నటిస్తుండగా, వెంకటేష్, భూమిక ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఆడబిడ్డలహొమనసుకు దగ్గరైన బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఈ సినిమా కోసం రూపొందించిన పాటను శుక్రవారం విడుదల చేశారు. తెలంగాణ పల్లె సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా పాటను చిత్రీకరించారు. ఈ పాటలో పూజా బుట్టబొమ్మలా అందర్నీ అలరిస్తోంది. ఈ పాట గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ, 'బతుకమ్మ పర్వదినం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భారతీయ సంస్కృతిలో పువ్వులను పూజించే గొప్ప పండుగ ఇది. తెలంగాణ అమ్మాయిలు సంబరంగా చేసుకునే, ఎంతో విశిష్టత ఉన్న పండుగ. సల్మాన్ ఖాన్, వెంకటేష్, భూమికతో ఈ పాటలో సందడి చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది' అని తెలిపారు. ఈ పాటకి రవి బస్రూర్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ఈ పాట ఉంటే బాగుంటుందని సల్మాన్‌కి వెంకటేష్ సూచించారని సమాచారం. ఫర్హాద్ సంజి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.