Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'లక్ష్యం', 'లౌక్యం' వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కలయికలో వస్తున్న చిత్రం 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మే 5న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మీడియాతో మాట్లాడారు.
మా అబ్బాయి వ్యాపారం చూసుకుంటున్నాడు. మా అమ్మాయికి మాత్రం సినిమాపై ఆసక్తి ఉంది. ప్రస్తుతం శర్వానంద్‌తో చేస్తున్న ఒక సినిమాలో ఆమె ప్రమేయం ఉంది. వెన్నెల కిషోర్ హోస్ట్‌గా 'అలా మొదలైంది' షో మంచి ఆదరణ పొందుతోంది. మా సంస్థ ప్రారంభంలోనే టీవీ రంగంలోకి పెట్టి, ఈటీవీలో మూడు సంవత్సరాల పాటు 'పాడుతా తీయగా' కార్యక్రమం చేసింది. అప్పటి నుంచే టీవీ షోలపై ఆసక్తి ఉంది. ఇప్పుడు మళ్లీ కొత్తగా ప్రయాణం మొదలుపెట్టాం. సినిమానే నాకు స్ఫూర్తి. ఇతర నిర్మాణ సంస్థల కంటే ప్రత్యేకతను చాటుకోవడమే మా లక్ష్యం.
దర్శకుడు శ్రీవాస్ ఈ కథ చెప్పినప్పుడు ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఫీలయ్యాను. 'లక్ష్యం, లౌక్యం' తర్వాత గోపీచంద్-శ్రీవాస్ కాంబోలోవస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని అందుకునేలా ఉంటుంది. బ్రదర్ సెంటిమెంట్ మీద రన్ అయ్యే సినిమా ఇది. 'లక్ష్యం, లౌక్యం' మాదిరిగానే యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ సెంటిమెట్ కూడా ఉంటుంది.
ఈ సినిమా కోసం కొన్ని టైటిల్స్‌ని పరిశీలించాం.
హీరో బాలకృష్ణగారు 'రామబాణం' టైటిల్‌ని సూచించారు. ఇది అన్నదమ్ముల కథ కావడంతో, టైటిల్ సరిగ్గా సరిపోతుందన్న ఉద్దేశ్యంతో ఆ టైటిల్‌నే ఖరారు చేశాం.
సినిమా అవుట్ పుట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. ఒక్కమాటలో చెప్పాలంటే 'లక్ష్యం', 'లౌక్యం' స్థాయిలోనే హిట్ ఖాయం.
గోపీచంద్, జగపతిబాబు గురించి వేరే చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో మరోమారు హిట్ బ్రదర్స్‌గా నిలుస్తారు. ఇందులో ఖుష్బూ పాత్ర చాలా బాగుంటుంది. దర్శకుడు శ్రీవాస్ ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయనకి ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది. మా సంస్థ నుంచి మరో హిట్ సినిమా రాబోతోందనే నమ్మకంతో మేమంతా ఉన్నాం.