Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బింబిసార', 'సార్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కథానాయిక సంయుక్తా మీనన్. తాజాగా ఆమె నటించిన మరో చిత్రం 'విరూపాక్ష'. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నూతన దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాయిక సంయుక్తా మీనన్ మీడియాతో ముచ్చటించారు.'రుద్రవనం అనే గ్రామంలో జరిగే కథ. ఇందులో నేను నందిని అనే అమ్మాయి పాత్ర చేశా. పాత్ర పరంగా నేను చాలా ముక్కుసూటిగా, చాలా యారగెంట్‌గా ఉంటాను. నా పాత్ర బిహేవ్ చేసే విధానంగా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తగ్గేదేలే.. అన్నట్టుగా హీరోతో నా పాత్ర ఉంటుంది (నవ్వుతూ). ఇది హర్రర్ థ్రిల్లరే అయినా పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. తేజ్‌కి ఈ సినిమా పెద్ద హిట్ కావాలి.