Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అటు భారతీయ సంస్క్రకృతీ సంప్రదాయాలను, ఇటు మానవీయ విలువలను ప్రతిబింబించే విధంగా రూపొందించిన సినిమా 'కలియుగ భగవాన్'. అల్లు ప్రొడక్షన్ బ్యానర్ పై అల్లు శ్రీరాములు నాయుడు నిర్మించిన ఈ సినిమాకు కథ, మాటలు, దర్శకత్వం డా.కోరుకొండ గోపీకృష్ణ. 'అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. ఐ.బ్రహ్మానంద రెడ్డి, సత్యప్రకాశ్, సామ్ దీరా, పావని, పెంటారావు అద్భుతంగా నటించారు. పాటలన్ని అద్భుతమైన సంగీతం, సాహిత్యంతో మెప్పిస్తాయి' అని దర్శకులు గోపీకృష్ణ చెప్పారు. నేడు (శుక్రవారం) ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: ఎం.ఎల్.రాజా, పాటలు: డా. తిరునగరి శరత్ చంద్ర, డా.కోరుకొండ గోపీకృష్ణ, మాటలు: డా.కోరుకొండ గోపీకృష్ణ, విల్లురి జగ్గ అప్పారావు, కో ప్రొడ్యూసర్స్ : మేడిది ఈశ్వర్ రావు, రాంబాబు ముక్కి, ఎడిటింగ్ :శ్యామ్ కుమార్.పి, డి.ఓ.పి. సంతోష్, కొరియోగ్రఫీ:కిరణ్ వారియర్.