Authorization
Mon Jan 19, 2015 06:51 pm
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కట్టి పడేసే కోర్టు రూమ్ డ్రామాతో రూపొందిన సిరీస్ 'వ్యవస్థ'. జీ 5లో ఈనెల 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్‌ను 'ఓయ్' ఫేమ్ ఆనంద్ రంగ తెరకెక్కించారు. ఇంతకు ముందు ఆయన జీ 5లో వచ్చిన 'షూట్ ఔట్ ఎట్ అలేర్' సిరీస్‌ను తెరకెక్కించారు. కార్తీక్ రత్నం, సంపత్ రాజ్, హెబ్బా పటేల్, కామ్నా జెఠ్మలానీ ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను హీరో సిద్ధు జొన్నలగడ్డ చేతుల మీదుగా జీ 5 గురువారం విడుదల చేసింది.
అందులో ఈ రోజు న్యాయం రేపటి క్రైమ్ అయితే నేటి క్రైమ్ రేపటి చట్టం అవుతుంది అని ఓ లా కోర్సు ట్రైనర్ తన స్టూడెంట్స్‌కు చెప్పటంతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. సంపత్ రాజ్ ఇందులో చక్రవర్తి అనే చాలా పవర్ఫుల్ పాత్రధారిగా, యువ నటుడు కార్తీక్ రత్నం ఇందులో కొన్ని నియమ నిబంధనలకు లోబడి పని చేసే మంచి మనసున్న జూనియర్ లాయర్ వంశీగా, యామినిగా హెబ్బా పటేల్, గాయత్రి అనే పాత్రలో కామ్నా జెఠ్మలానీ కనిపించనున్నారు.