Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నాంది'తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్ మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ 'ఉగ్రం'తో వస్తున్నారు. శుక్రవారం మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ఉగ్రం కథాంశాన్ని రివీల్ చేసింది.
'నగరంలో మిస్సింగ్ కేసుల వెనుక ఉన్న కొంతమంది పవర్ఫుల్ వ్యక్తులపై నిజాయితీ గల పోలీసు భారీ రిస్క్ తీసుకుని చేసిన పోరాటమే 'ఉగ్రం'.
అతని కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తారు. అయితే అతను కేసును ఛేదించి, నేరస్థులను పట్టుకోవడానికి ఏం చేశాడు అనేది మాత్రం ఆద్యంతం ఆసక్తికరం. ట్రైలర్లో అల్లరి నరేష్ కొత్తగా, మునుపెన్నడూ చూడని ఫెరోషియస్పాత్రలో కనిపించారు. ట్రైలర్ రెండవ సగం అతన్ని బ్రూటల్ అవతార్‌లో ప్రజెంట్ చేసింది. ట్రైలర్లో యాక్షన్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉందని చెప్పకనే చెప్పింది. సిద్ సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకాల అద్భుతమైన బీజీఏం గ్రేట్ వాల్యుని జోడించాయి. నరేష్ భార్యగా మిర్నా బాగా నటించింది' అని చిత్ర బృందం తెలిపింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం వేసవి కానుకగా మే 5న విడుదల కానుంది.