Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నాంది' వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబోలో మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ 'ఉగ్రం' రాబోతోంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. మీర్నా మీనన్ కథానాయికగా నటించింది. మే 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ చిత్ర విశేషాలను గురువారం నాయిక మీర్నా మీనన్ మీడియాతో షేర్ చేసుకున్నారు. 'నేను సాప్ట్వేర్ డెవలపర్‌ని. దుబాయి, కేరళలో ఇంజనీర్‌గా పని చేశాను. ఒక రోజు దర్శకుడు అమీర్ నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్ ఫలితమే తమిళంలో ఆర్యతో నటించే అవకాశం వచ్చింది. తర్వాత మోహన్ లాల్ 'బిగ్ బ్రదర్', దీని తర్వాత 'క్రేజీ ఫెలో' చేశాను. వీటిల్లో వచ్చిన గుర్తింపుతో సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' సినిమాలో అవకాశం వచ్చింది. అది ఫస్ట్ షెడ్యూల్లో ఉండగానే దర్శకుడు విజయ్ ఈ సినిమా కోసం సంప్రదించారు. 'ఉగ్రం' కథ చెప్పినప్పుడే ఓకే చెప్పేశాను. కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే నా పాత్ర చాలా ఛాలెజింగ్‌గా ఉంటుంది. కాలేజీ అమ్మాయిగా, భార్యగా, ఒక బిడ్డకు తల్లిగా.. ఇలా భిన్నమైన కోణాలు నా పాత్రలో కనిపిస్తాయి. కెరీర్ బిగినింగ్‌లో ఇలాంటి పాత్ర చేయడం సవాలే. ఆ సవాల్‌ని స్వీకరించి ఈ పాత్ర చేశాను. పైగా నా పాత్ర పూర్తి స్థాయిలో, నరేష్‌తో పాటు కథలో ప్రయాణిస్తూ ఉంటుంది. నటనకు ఆస్కారం ఉండే పాత్ర దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. నరేష్ కామెడీ, సీరియస్ రెండు పాత్రలని అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు. దర్శకుడు విజరు కనకమేడల చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. తన స్క్రీన్ ప్లే రాసుకునే విధానం అద్భుతం. ప్రతి సీన్‌కి చివర్లో ఒక మీనింగ్ ఉంటూ అది కథలో భాగమవుతుంది. తను మంచి ఎడిటర్ కూడా. సినిమా ఆయన మైండ్‌లోనే ఎడిట్ అయిపోతుంది. ఇందులో నాకు పాపగా నటించిన ఊహ కూడా అద్భుతంగా చేసింది. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో పని చేయడం ఆనందంగా ఉంది. మంచి సినిమాలు చేయాలనే ఆలోచనతో ఉండే నిర్మాతలు. ప్రస్తుతం వెట్రిమారన్ కథతో అమీర్ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే మలయాళంలో మరో సినిమా చేస్తున్నా' అని తెలిపారు.