Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీవిష్ణు కథానాయకుడిగా 'వివాహ భోజనంబు' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సామజవరగమన'. ఎకె ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పిస్తునారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ హీరోయిన్గా నటిస్తోంది. సరదాగా సాగే ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ గురువారం విడుదల చేశారు.
హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ,'ఇదొక కంప్లీట్ ఎంటర్టైనర్. ఇంత ఎంటర్టైనర్ని నేనూ ఎప్పుడు చేయలేదు. సినిమా చాలా బాగా వచ్చింది. మొదటి నుంచి చివరి వరకూ నవ్వుకుంటూనే ఉంటారు. నిర్మాత రాజేష్ దండా ఈ కథతో వచ్చినపుదు ఆయన చేస్తున్న 'మారేడుమిల్లీ, భైరవ కోన' తరహాలో ఉంటుందని అనుకున్నాను. కానీ ఇది సూపర్ ఫన్ సబ్జెక్ట్. కథ విన్నప్పుడే చాలా ఎంజారు చేశాను' అని తెలిపారు. 'ఈ కథ రామ్ చెప్పగానే బాగా నచ్చింది. ఎంటర్టైన్ మెంట్ నా జోనర్. చాలా రోజులైయింది ఎంటర్టైన్ మెంట్ మూవీస్ చేసి. శ్రీవిష్ణు ఎంచుకునే కథలు యూనిక్‌గా ఉంటాయి. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన పక్కా ఎంటర్టైనర్ ఇది. నిర్మాత రాజేష్ కథల ఎంపిక బావుంటుంది.
దర్శకుడు రామ్ చాలా నిజాయితీ గల దర్శకుడు' అని నిర్మాత అనిల్ సుంకర అన్నారు. నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ,' ఈ కథ చెప్పినప్పుడు నాన్ స్టాప్‌గా నవ్వుకుంటూనే ఉన్నాను. నాకు బాగా నచ్చి, అనిల్ సుంకరకి చెప్పాను. ఆయనకి కూడా చాలా బాగా నచ్చింది. దర్శకుడు ఏదైతే చెప్పాడో దాని కంటే బాగా తీశాడు. హాస్య మూవీస్ బ్యానర్ స్టార్ట్ అవ్వడానికి కారణం అనిల్ సుంకర. ఆయన లేకపోతే ఈ బ్యానర్ లేదు' అని తెలిపారు.
'ఇది చిన్న టీజర్. ట్రైలర్, సినిమా ఇంకా ఫన్‌గా ఉంటాయి. ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా ఎంజారు చేసే సినిమా ఇది. శ్రీవిష్ణులో కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవల్. మనం వంద రాస్తే దాన్ని వెయ్యికి తీసుకువెళ్తారు. రెబ్బా చక్కగా నటించింది' అని దర్శకుడు రామ్ అబ్బరాజు అన్నారు.