Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోసపు రాజకీయాల్లో కేసీఆర్ దిట్ట : మాజీ ఎంపీ మల్లు రవి
- దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోర సభను విజయవంతం చేద్దాం
- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధువు కాదు.. దళిత ద్రోహి అని మాజీ ఎంపీ టీపీసీసీ ఉపాధ్యాక్షుడు మల్లు రవి ఆరోపించారు. మోసపూరిత రాజకీయాలకు కేసీఆర్ కేరాప్ అడ్రస్ అని.. ఇందులో ఆయనను గిన్నిస్ బుక్‌లో చేర్చవచ్చని ఆయన ఎద్దేవా చేశారు. ఈ నెల 9వ తేదీన జరిగే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం విజయవంతం చేసేందుకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి అధ్యక్షతన శుక్రవారం గాంధీభవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మల్లు రవి మాట్లాడుతూ దళిత, గిరిజనులకు రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. అంటరాని తనాన్ని వ్యతిరేకించే వారికే పార్టీలో సభ్యత్వం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దళితలను మోసం చేసిందన్నారు. దళిత ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ మాట తప్పిండని విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు దళితులకు రూ.65వేల కోట్లు బడ్జెట్ పెట్టి ఒక్క రూపాయ ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. ఇలాంటి కేసీఆర్ ఇప్పుడు రూ.2వేల కోట్లతో దళిత బంధు పేరుతో మరో మారు మోసం చేసేందుకు దళితుల ముందుకు వస్తున్నారని విమర్శించారు. రాష్టంలోని ఎంత మంది దళితులకు ఎంత భూమి కావాలో ప్రభుత్వం చెప్పితే ఆ భూమిని చూపించే బాధ్యత మేము తీసుకుంటామన్నారు. అందుకు అయ్యో నగదును విడుదల చేయాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ అధికారంలోకి మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ పై ఉందని చెప్పే వారికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలతో దిమ్మతిరుగుతుందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ 100 స్పీడ్‌తో దూసుకెళ్తుదన్నారు.
కష్టపడే వారిని పార్టీ గుర్తిస్తోంది : జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి
కష్టపడే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా అధ్యక్షడు చల్లా నర్సింహారెడ్డి అన్నారు.టీపీసీసీ అధ్యక్షుడు ప్రతి నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులను పర్యవేక్షిస్తున్నరని.. పార్టీ బలోపేతానికి కృషిచేసిన నాయకులకు, కార్యకర్తలకు భవిష్యత్‌లో మంచి రోజులు వచ్చే అవకాశం ఉందన్నారు. పీసీసీ తీసుకునే ప్రతి కార్యక్రమం తుచా తప్పకుండా విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రామ్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, వసంత్, జ్ఞానేశ్వర్, జైపాల్ రెడ్డి, దేప భాస్కర్ రెడ్డి, ఏనుగు జంగారెడ్డి పాల్గొన్నారు.