Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నాయకుల ఆరోపణ
నవతెలంగాణ-దోమ
టీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. శుక్రవారం పార్టీ మండలాధ్యక్షుడు మాలి విజరుకుమా ర్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్, రాష్ట్రబీసీ సంఘం కార్యనర్వాహక్ అధ్యక్షు డు లాల్‌కృష్ణ ప్రసాద్, బహుజన ఉద్యమకారుడు రామన్న మాదిగ, పార్టీ జిల్లా కార్యదర్శి అశోక్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ కిష్టాపూర్‌లో సర్పంచ్ల వ్యవధి ముగిసిన అనంతరం ప్రత్యేక అధికారులను నియమించిన సమయంలో తాజా మాజీ సర్పంచ్ కుమారుడు పనులు చేయించాడని తెలిపారు. బిల్లులు చెల్లింపునకు సిద్ధంగా ఉన్నా దోమ జడ్పీటీసీ నాగిరెడ్డి బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. బాధితులు పంచాయతీ కార్యదర్శి నుంచి పంచాయతీ రాజ్ శాఖ ఉన్నత అధికారుల వరకూ ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించగా వెంటనే బిల్లులు చెల్లించాల ని హైకోర్టు పంచాయతీ రాజ్ శాఖను ఆదేశించినట్టు తెలిపారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. అధికారులు కూడా టీఆర్ఎస్ నాయకులకు వంతపడడం సరికాదన్నారు. అధికారులు తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, నర్సింహచారి, నీరటి శేఖర్, నీరటీ రాములు, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శాంత కుమార్, పరిగి టౌన్ ప్రెసిడెంట్ కృష్ణ, మోగులయ్య, వెంకట్ రాములు, ఆంజనేయులు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.