Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
- అదనుపు గదులు, సైన్స్‌ల్యాబ్ ప్రారంభం
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ధారూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.30 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను, 9 లక్షల రూపాయలతో నిర్మించిన సైన్స్లాబ్ను ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, విద్య మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేం దర్‌గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ విజరు కుమార్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో విద్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 4 వేల కోట్లతో ప్రతిపాదనలు. ప్రయివే టుకు దీటుగా అత్యాధునికంగా మార్చటానికి కృషి చేస్తామన్నారు. తెలంగాణను విద్యా హబ్‌గా మార్చుతామన్నారు. ప్రపంచంతో మన తెలంగా ణ విద్యార్థులు పోటీ పడేలా చర్యలు తీసుకుంటు న్నామన్నారు. విదేశాల్లో మన తెలంగాణ విద్యార్థు లు చదువుల కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు.ఉమ్మడి రంగా రెడ్డి జిల్లాకు నాలుగు డిగ్రీ కళశాలలు మంజూరు చేసినట్టు తెలిపారు. వికారాబాద్ ప్రజల చిరకాల వాంఛ అయిన డిగ్రీ కళాశాలను మంజూరు చేసినట్టు తెలిపారు. పదవ తరగతి, ఇంటర్ తర్వాత బాలికలు విద్యా ఆపకుండా 33 మహిళ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.