Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజులరమేష్
- రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
వికారాబాద్ మున్సిపల్ పరిధిలో పది ఎకరాల్లో రూ. 3కోట్ల 82లక్షలతో డంప్ యార్డును నిర్మిస్తున్నట్టు మున్సిపల్ చైర్పర్సన్ మంజులరమేష్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ మున్సి పల్ పరిధిలోని 9వ వార్డు మేకల గండిలో గల డంప్ యార్డు వరకు (గోధుమగుడా ప్రధాన రోడ్డు నుంచి డంప్ యార్డు వరకు) రూ.18 లక్షల 14వ ఫైనాన్స్ నిధులతో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డంప్‌యార్డును అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. డంప్ యార్డులో దాదాపుగా అన్ని పనులు పూర్తి అవగా, షెడ్లు, మిషనరీ పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం షెడ్ల నిర్మాణాలు జరుగుతుం డగా, మిషనరీ పనులు చేపట్టాల్సి ఉందన్నారు. రెండు, మూడు నెలల్లో పెండింగ్ పనులు అన్ని పూర్తి చేసి, డంప్ యార్డును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ శంషాద్ బేగం, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, కౌన్సిలర్ సురేష్, డీఈ రామ్‌కిషన్, మున్సిపల్ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు వెంకట్, కాంట్రాక్టర్, తదితరులు పాల్గొన్నారు.