Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోరు కుమార్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ప్రతి ఒక్కరూ ప్రొఫెసర్ జయశంకర్ అడుగుజాడల్లో నడవాలని జిల్లా కలెక్టర్ అమోరు కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమా లలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాలు, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేశారన్నారు. తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడన్నారు. అధ్యాపకుడిగా ఆయన ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారని గుర్తు చేశారు. వృత్తి పట్ల నిబద్ధతను, తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని నూరిపోశారని తెలిపారు. అయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు తిరుపతి రావు, ప్రతీక్ జైన్, కార్యాలయ సిబ్బంది , తదితరులు ఉన్నారు.