Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన మండల నాయకులు
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
బంజారా భవనానికి ప్రభుత్వం రూ. కోటీ కేటాయించడం పట్ల హర్షం కొడంగల్ తాలూకా బంజారా సంఘం అధ్యక్షులు దేశ్యానాయక్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం బొంరాస్‌పేట మండలానికి చెందిన నాయకులు మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రెండెకరాల 20గుంటల భూమి, ఇప్పుడు రూ. కోటీ కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, జడ్పీటీసీ అరుణ దేశు, టీటీ రాములు నాయక్, లోకోట్ల యాదగిరి, మహేందర్ రెడ్డి, విష్ణు వర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.