Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నార్సింగి కౌన్సిలర్ ఉషారాణి
నవతెలంగాణ-గండిపేట్
పార్టీలకు అతీతంగా ప్రజా అభివృద్ధి చేేస్తామని నార్సింగి కౌన్సిలర్ కే ఉషారాణి అన్నారు. ఆదివారం నార్సింగి మున్సిపాలిటీలోని 17వ వార్డు భూలక్ష్మమ్మ టెంపుల్ వద్ద విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు పది కరెంట్ పోల్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ వార్డు ప్రజల కోరిక మేరకు కరెంట్ పోల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మున్ముందు కూడా స్థానికంగా ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. వార్డుల్లో గతంలో ఏర్పాటు చేసిన ఇనుప పోల్స్‌ను తొలగించి వాటి స్థానంలో కొత్త పోల్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిత్యం అందుబాటులో ఉంటామని అన్నారు. ప్రజా సహకారంతో అధికారుల సమన్వయంతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.