Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ సభకు తరలిన నాయకులు
నవతెలంగాణ-గండిపేట్
రాష్ట్రంలో గడీల పాలనపై బహుజనులందరూ పోరుకు ఏకమవ్వాలని బీఎస్సీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్ అన్నారు. ఆదివారం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ నుండి బహుజనులందరూ మాజీ ఐపీఎస్ డాక్టర్ ఆర్ఎస్పీ సభకు తరలివెళ్లారు. హాల్లో బహుజన ఛలో నల్గొండ నివాదంతో కార్యకర్తల స్వేరోలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. అందుకు ముందుకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. బహుజన గర్జన సమక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఎస్సీ పార్టీల్లో అధికారికంగా చేరుతున్నట్లు ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసేందుకు బహుజను లందరూ దండుకట్టాలన్నారు. కార్యక్రమంలో నాయకులు, స్వేరో కార్యకర్తలు, పాల్గొన్నారు.