Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర నాయకుడు ఆలంపల్లి నరసింహ
నవతెలంగాణ-యాచారం
దేశంలో రెండోసారి అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని కేవీపీఎస్ రాష్ట్ర నాయకుడు ఆలంపల్లి నరసింహ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మేడిపల్లిలో సర్పంచ్ చిగురంత శ్రీనివాస్ రెడ్డికి కేంద్ర అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపాదనలు చేసి పంపాలని సీపీఐ(ఎం) నాయకులు కరపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన చమురు ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కరోనాతో సర్వం కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ వెంటనే రద్దు చేయాలని తెలిపారు. నేడు జరిగే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నరసింహ పేర్కొన్నారు. దేశంలో ఉపాధి హామీ పథకానికి అధిక నిధులు కేటాయించి ఉపాధి పెంచాలని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గడ్డం చెన్నయ్య, ఎండి జాంగిర్, వడ్డె మొని భూషణ్, ఆలంపల్లి యాదయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అలంపల్లి జంగయ్య, కాన మోని యాదయ్య, గడ్డం కుమార్, ఆలంపల్లి శ్రీనివాస్, మహేష్, మల్లేష్, యాదయ్య, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.