Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిణి మోతి బాయి
నవతెలంగాణ-ఆమనగల్
ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న గిరి పోషణ పథకాన్ని చెంచు గిరిజనులు సద్వినియోగం చేసుకుని లబ్ది పొందాలని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిణి మోతి బాయి అన్నారు. అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా సోమవారం కడ్తాల్ మండలంలోని వాసుదేవ్పూర్ గ్రామంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మోతిబాయి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని గిరిజన బాల బాలికలు, మహిళలకు మెరుగైన పోషకాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గిరి పోషణ పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ పథకం ద్వారా చెంచు, గిరిజనులకు చెందిన కిషోర బాలికలు, గర్భిణులు, బాలింతలకు క్రమం తప్పకుండా పోషకాహారం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి రామేశ్వరీదేవి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కరుణాకర్ రెడ్డి, ఆమనగల్ సీడీపీవో సక్కుబాయి, ఎంపీడీవో రామకష్ణ, జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్, ఎంపీపీ కమ్లిమోత్యా నాయక్, ఎంపీటీసీ పాత్లావత్ లచ్చిరామ్ నాయక్, సర్పంచ్ చాంది, సూపర్ వైజర్ జయమ్మ, ఆస్మిత్, అంగన్వాడీ టీచర్ కమల, వార్డు సభ్యులు రాణి, శ్రీనివాస్, రామకష్ణ, శివ, లక్ష్మణ్ జీ, నర్సమ్మ, తదితరులు పాల్గొన్నారు.