Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్
నవతెలంగాణ-ఆమనగల్
పెట్టుబడి దారుల కొమ్ము కాస్తూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్ డిమాండ్ చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సీఐటీయూ ఆధ్వర్యంలో వ్యవసాయ, పారిశుధ్య కార్మికులు సోమవారం ఆమనగల్ పట్టణంలో దేశరక్షణ దినోత్సవం పాటించారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదురుగా శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన సత్యాగ్రహ దీక్షలను శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ జి కవిత, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాన్గుల వెంకటయ్యతో కలిసి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రయివేటులోని ఖాళీలను భర్తీ చేయాలన్నారు. ఇండియన్ లేబర్ కాన్ఫెరెన్స్ సిఫారసుల మేరకు కార్మికులందరికీ రూ.21 వేల కనీసవేతనం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జిల్లా నాయకులు దుబ్బ చెన్నయ్య, శివగల్ల రమేష్, పెంటయ్య, సీఐటీయూ మాడ్గుల కన్వీనర్ అంజయ్య, మున్సిపల్ కన్వీనర్ మల్య నాయక్, జిల్లా నాయకురాలు హంసమ్మ, యాదమ్మ, సభ్యులు చందర్, రాములు, ఆజం, సుధాకర్, విజరు, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.