Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కందుకూరు
గుంట భూమి ఉన్న ప్రతి రైతుకూ రైతుబంధు, రైతుబీమా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని, ఆకులమైలారం గ్రామంలో ముదిరాజ్ భవన్ రూ.10 లక్షల వ్యయంతో శంకుస్థాపన, మిరాన్పేట్ గ్రామంలో రూర.79 లక్షల 60 వేలు, రైతు వేదిక భవనం, మినీకళ్యాణ మండపం, బేగరికంచెలో అండర్ గ్రౌండ్ డ్రయినేజీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు లు ప్రతిరోజు కడుపునిండా భోజనం చేయడానికి సీఎం కేసీఆర్ ముందుచూపుతో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతులకు అందజేస్తున్నారని అన్నారు. రైతుబంధు కోసం ప్రతి సంవత్సరం రూ.12 వందల కోట్లు, 24 గంటల విద్యుత్ సర ఫరా కోసం రూ.5 వేల కోట్లు బడ్జెట్లో కేటాయి స్తున్నట్టు వివరించారు. ప్రతి సంవత్సరం రైతుబంధు రెండుసార్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమచేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 65లక్షల మంది రైతులకు, రూ.37,900 కోట్లు రైతుబంధు కోసం జమ చేయడం జరుగుతుందన్నారు. కందుకూరు మండలంలో 118 మంది రైతులు మృతి చెందగా, వారందరికీ రూ.7కోట్ల4 లక్షలు రైతుబీమా డబ్బులు అందజేసినట్టు చెప్పారు. ఈ పథకాల్లో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా అందిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులందరికీ ఇంటికో ఉద్యోగం, ఒక గుంట కాలిస్థలంతో పాటు, ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ లోను రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంద జ్యోతి పాండు, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, వైస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి, మహేశ్వర మార్కెటింగ్ చైర్పర్సన్ సురసాని వరలక్ష్మి సురేందర్ రెడ్డి, కందుకూరు సహకార సంఘం చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, కందుకూరు సహకార సంఘం ఉపాధ్యక్షులు విజేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మన్నె జయేంద్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి, రైతు సమన్వయ మండలాధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి, సర్పంచులు గోరిగే కళమ్మ రాజు, జ్యోతి శేఖర్, ఢిల్లీ సారలమ్మ, కాసుల రామకృష్ణారెడ్డి, కాకి ఇందిరా, పోలే మోని బాలమణి అశోక్, నరేందర్ గౌడ్, మంద సాయిలు, వింజమూరి రామచంద్రారెడ్డి, శ్రీనివాస్, గోపాల్ రెడ్డి, ఎంపీటీసీలు రాములు, అచ్చన్న పద్మ, సురసానీ రాజశేఖర్ రెడ్డి, మంచాల యాదయ్య, కో ఆప్షన్ సభ్యులు ఎం డీ .సులేమాన్, డైరెక్టర్లు పొట్టి ఆనంద్, శేఖర్ రెడ్డి, నాయకులు కాకి దశరథ, రవి కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షుడు సామ మహేందర్ రెడ్డి, మోదర్ గౌడ్, మేఘనాథ్ రెడ్డి, ఈశ్వర్ గౌడ్, గుయ్యనీ సామయ్య, పాండు గౌడ్, బి. వెంకటేష్, దీక్షిత్‌రెడ్డి, కార్తీక్, విష్ణు, ప్రశాంతిచారి, వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.