Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంచాల
గిరిజన రైతులు చేస్తున్న భూ పోరాటాలకు సీపీఐ(ఎం)పార్టీ అండగా ఉంటూ, ప్రత్యేక్ష పోరాటాల్లో పాల్గొంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం మండల పరిధిలోని ఎల్లమ్మ తండా, జపాల్ గ్రామాలో నిర్వహించిన సీపీఐ(ఎ) శాఖ మహాసభల్లో ఆయన హాజరై, మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ద్వారా సాధించుకున్న భూములను ప్రభుత్వం లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, భూస్వాములకు, పెట్టుబడి దారులకు కట్టబెట్టాలని చూస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ అసైన్డ్ భూములకు, సీలింగ్ భూములకు నూతన పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం లేదన్నారు. ముఖ్యంగా బోడకొండ, ఎల్లమ్మతండా, వెంకటెశ్వర తండా గ్రామాల్లో జరుగుతున్న భూ పోరాటాలకు సీపీఐ(ఎం) అండగా ఉంటుందన్నారు. నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి నేటి వరకూ సీపీఐ(ఎం) దున్నేవాడికి భూమి కావాలనే నినాదతో ప్రజల పక్షాన నిలబడుతూ ఎన్నో భూపోరాటాలు చేసి వేలాది ఎకరాలభూములను పంపిణీ చేసినట్టు గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైయ్యాని విమర్శించారు. అంతేకాకుడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంలో కేంద్ర, ప్రభుత్వం చొరవచూపడం లేదన్నారు. హుజూర్ నగర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ దళితులకు ప్రతి ఇంటికి రూ.10 లక్షలు ఇస్తామని చెబుతూ, మరోసారి ప్రజలను మోసం చేయాడానికి చూస్తున్నారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడూ ప్రజలకు తెలియజేస్తూ, ప్రజల పక్షాన నిలబడుతూ, స్థానిక సమస్యలు గుర్తించి, పరిష్కరించే విధంగా కృషి చేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. తదనంతరం బోడ కొండ, ఎల్లమ్మతండా, వెంకటేశ్వరతండా, చెన్నారెడ్డిగూడ గ్రామాలకు చెందిన కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తమ్మినేని వీరభద్రం సమక్షంలో సీపీఐ(ఎం) పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుబ్బాక రాంచందర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ, మండల కార్యదర్శి కర్నాటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు గొరెంకల నరసింహా, మండల కమిటీ సభ్యుడు రావుల జంగయ్య, మాజీ ఎంపీపీ కొర్ర శ్రీనివాస్ నాయక్, మండల కమిటీ సభ్యుడు డీవైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిలివెరు రాజు, లట్టుపల్లి నర్సిరెడ్డి, పల్లాటి జగన్, నాగిల్ల శ్యాం సుందర్, మార బుగ్గరాములు, జపాల్ సర్పంచ్ సయ్యద్ నహిద్ రహుఫ్, ఎంపీటీసీ లట్టుపల్లి చంద్రశేఖర్ రెడ్డి, చీదెడ్ సర్పంచ్ బైరిక రమాకాంత్ రెడ్డి, రంగాపూర్ సర్పంచ్ డబ్బికార్ మమత అజరు బాస్, ఎల్లమ్మ తండా శాఖ కార్యదర్శి కాంటే కార్ జగదీష్, మాజీ సర్పంచ్ సపావట్ చందు నాయక్, మాజీ ఎంపీటీసీ కాంటేకార్ యాదిశ్వర్, సీపీఐ(ఎం) జపాల గ్రామ కమిటీి కార్యదర్శి లేనిన్, శాఖ కార్యదర్శులు యాట జగన్, సయ్యద్ రాజాజ్ పాషా, నోముల క్రిష్ణ, అంజనేయులు, గ్రామ కోఆప్షన్ సభ్యుడు ఒరుగంటి బాస్కర్, వార్డు సభ్యులు అరవింద్ రెడ్డి, కొప్పు జనార్ధన్ తదితరులు ఉన్నారు.