Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌన్సిలర్ నాగపూర్ణ శ్రీనివాస్
నవతెలంగాణ-గటండిపేట్
మూగ జీవితాలను రోగాల బారి నుండి కాపాడుకోవాలని కౌన్సిలర్లు మైలారం నాగపూర్ణ శ్రీనివాస్, పద్మా వీరారెడ్డి అన్నారు. మంగళవారం నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవుల గ్రామంలో పశువైద్యధికారి డాక్టర్ సయ్యద్ మున్నిర్ద్దీన్ ఆధ్వర్యంలో పశువులను నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్లు ముఖ్యులుగా పాల్గొని మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు పశు సంపదను పెంచుకోవాలన్నారు. వర్షాకాల సీజన్లో రోగాల నుండి జీవాలను కాపాడుకునేందుకు అధికారుల సూచనలు, సలహాలు పాటించాలని, ఉచిత మందులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీజన్ వ్యాధులు రాకుండా ప్రతి జీవానికి నట్టల నివారణ మందులివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్యధికారి డాక్టర్ మున్నిర్ద్దీన్, మాజీ వార్డు సభ్యులు మైలారం శ్రీనివాస్ పాల్గొన్నారు.