Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో భారీ వాహన ర్యాలీ..
- దళిత గిరిజనులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు : వీర్లపల్లి
నవతెలంగాణ-షాద్ నగర్ రూరల్
షాద్ నగర్ నియోజకవర్గం నుండి ఇంద్రవెల్లిలో నిర్వహిస్తున్న దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు భారీగా తరలివెళ్లారు. సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో 110 వాహనాలతో భారీ ర్యాలీగా ఇంద్రవెల్లి సభకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని కొందుర్గు, చౌదరిగూడ, కేశంపేట, నందిగామ, కొత్తూరు, ఫరూఖ్ నగర్ మండలాలతో పాటు షాద్ నగర్ మున్సిపాలిటీ నుండి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉదయం 6 గంటలకే పట్టణంలోని వీర్లపల్లి నివాసానికి చేరుకొని అక్కడి నుండి పాదయాత్రగా ముఖ్య కూడలికి చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఇంద్రవెల్లికి తరలివెళ్లారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి దళిత గిరిజనుల పై చిత్తశుద్ధి లేదని, 2014ఎన్నికల్లో దళిత ముఖ్యమంత్రి అని మాటమార్చారని, గిరిజనులకి 12శాతం రిజర్వేషన్ల హామీలే ఇందుకు నిదర్శనం అని మండిపడ్డారు. దళితులను గిరిజనుల పట్ల ప్రభుత్వానికి చిన్నచూపు తగదని అన్నారు. కేవలం హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు పెట్టారని, అక్కడ అధిక సంఖ్యలో దళిత ఓటర్లు ఉండడంతో దళిత బంధు ఇచ్చి వారి ఓట్లను దండుకునేందుకే అని విమర్శించారు. నిజంగా దళితులపై ప్రేమ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దళిత బంధు మాత్రమే కాదు, గిరిజన, మైనార్టీ, బిసి, సంచార జాతుల కుటుంబాల బంధు కూడా ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు టీపీసీసీ నూతన రథసారథి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలపడుతుందని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని కేసీఆర్ అవినీతి అక్రమాలను బయట పెట్టడం తథ్యమని చూసి అని చెప్పారు ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు బాబర్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు బాల్రాజ్ గౌడ్, చెన్నయ్య, శ్రీకాంత్ రెడ్డి, కష్ణారెడ్డి, ఆశన్న గౌడ్, సీతారాములు, బుడ్డ నరసింహ, సుదర్శన్, కష్ణ, మసూద్ ఖాన్,అందే మోహన్, ఖదీర్, ముబారక్ అలీ ఖాన్, మాణిక్యం, అశోక్ పాల్గొన్నారు.న