Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుల్కచర్ల
అర్హులైన రైతులు రైతు బీమా పథకం కోసం దరఖాస్తూ చేసుకోవాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సారా శ్రీనివాస్ అన్నారు. కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ క్లస్టర్ రైతు వేదికలో సోమవారం వ్యవసాయ అధికారులు రైతుల నుంచి రైతుభీమా దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన రైతులు రైతు బీమా దరఖాస్తూ చేసుకోవాలన్నారు. ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో వంశి, మల్లేశం, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.