Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్
- ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ వికారాబాద్ ప్రతినిధి
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ అన్నారు. సోమవారం వికారాబాద్ లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి. రామకృష్ణ అధ్యక్షతన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ ఏడేండ్ల బీజేపీ హయంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సాహిస్తోందన్నారు. బొగ్గు, రైల్వే, విద్యుత్, విమానాశ్ర యాలు, ఓడరేవులు స్టీల్ ప్లాంట్లు, ఆయిల్ కంపెనీలు మొదలుకొని విద్య, వైద్యం చివరికి రక్షణ రంగాన్ని కూడా కార్పోరేట్ అధిపతులకు అప్పజేపేందుకు కుట్రలు చేస్తోం దన్నారు. పార్లమెంటులో ఉన్న మంద బలాన్ని ఉపయో గించి అనేక నిరంకుశ చట్టాలను రూపొందిస్తున్నదని ఆరోపించారు. అందులో భాగంగానే వ్యవసాయరంగాన్ని సర్వనాశనం చేసి ఆహార భద్రతను దెబ్బతీసే 3 వ్యవసా య చట్టాలు తెచ్చిందన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నీరుగార్చి, కార్మికులను బానిసత్వంలోకి నెట్టేందుకు కుట్రలో చేస్తోందని మండిపడ్డారు. విద్యుత్ చట్టానికి సబ్సీడిని ఎగ్గొట్టేందుకు విద్యుత్ సవరణ చట్టం చేస్తున్నదని ఆరోపించారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తూ దేశ ఫెడరల్ విధానానికి తూట్లు పొడుస్తూ రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.