Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండ్లగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి
నవతెలంగాణ-గండిపేట్
రాష్ట్రంలో గడీల పాలనకు చమరగీతం పాడాలని బండ్లగూడ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూలపల్లి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం గండిపేట్ మండలంలోని బండ్లగూడ, నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల నుండి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున దళిత, గిరిజన దండోరా సభకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంద్రవెళ్లిలో టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి నిర్వహించిన సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారని తెలిపారు. టీఆర్ఎస్, బీజేపీ సర్కారు చేస్తున్న మెసాలను తిప్పి కొట్టాలన్నారు. దళితుల, గిరిజనులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధులను అమలు చేసేందుకు కేసీఆర్ సర్కారు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం మోసం చేస్తున్న కేసీఆర్‌కు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి జ్ఞానేశ్వర్, మంగిజైపాల్రెడ్డి, కార్పొరేటర్ ముద్దం రాము, క్యాతం అశోక్‌యాదవ్, సింగిల్ విండో చైర్మెన్ పి సంజీవరెడ్డి, బోగాల శ్రీనివాస్, మైలారం శ్రీనివాస్, టింకురెడ్డి, పుతాడి నరేష్, కృష్ణా భగవాన్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.