Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య దేవేందర్ యాదవ్
నవతెలంగాణ-కొత్తూరు
సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కొత్తూరు మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య దేవేందర్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆమె సీజనల్ వ్యాధులపై తీసుకోవలసిన జాగ్రత్తల పట్ల డాక్టర్లతో మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రారంభమయ్యే సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం డాక్టర్ కవిత మాట్లాడుతూ వర్షాకాలంలో సోకే సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. ఒకరి ప్రిస్క్రిప్షన్పై తెచ్చిన మందులను మరొకరు వాడవద్దని సూచించారు. కమిషనర్ వీరేందర్ మాట్లాడుతూ మండలంలోని ఆర్ఎంపీ డాక్టర్లు కరోనా రోగులకు చికిత్స చేయొద్దని, చికిత్స చేసినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెడికల్ షాప్ల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులివ్వాలని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీనివాస్, తిమ్మాపూర్ ఎంపీటీసీ చింతకింది రాజేందర్ గౌడ్, సీనియర్ నాయకులు దేవేందర్ యాదవ్, కమ్మరి జనార్ధన్ చారి, తదితరులు పాల్గొన్నారు.