Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ రాజ్ కుమార్
నవతెలంగాణ-తాండూరు
సమస్యలను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారని బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజకవర్గం కన్వీనర్ రాజ్‌కుమార్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణ కేంద్రంలో బీసీ శ్మశాన వాటికను సందర్శించారు. నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ తాండూర్ బీసీ శ్మశానవాటికలోని పిచ్చిమొక్కలను బీసీ సంఘం ఆధ్వర్యంలో జేసీబీ సాయంతో తొలగించారు. రాజ్‌కుమార్ మాట్లాడుతూ శ్మశానవాటికలో అంత్యక్రియలు చేసేప్పుడు బీసీలు ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలిపారు. తాండూర్‌కు చెందిన టైలర్ రమేష్ చిన్నాన్న మృతిచెందగా శ్మశానవాటిక లోపలికి వెళ్లలేని పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. మున్సిపల్ అధికారులకు చెప్పినా స్పందించకపోవడంతో జేసీబీతో మొక్కలను తొలగించినట్టు తెలిపారు. శ్మశాన వాటిక అభివద్ధికి 14 ఫైనాన్స్ ఫైనాన్స్ కింద 55 లక్షలు మంజూరైనా కాంట్రాక్టర్లు మాత్రం తూతూమంత్రంగా పనులు నిర్వహిస్తూ వస్తున్నారని తెలిపారు. ఉన్నతాధికారు లకు వినతి అందజేసినా స్పందించకపోవడం బాధాకరమని తెలిపారు. వెంటనే శ్మశానవాటికను అభివద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ నాయకులు గడ్డం వెంకటేష్, యువ నాయకులు టైలర్ రమేష్, విజరు శ్రీనివాస్, షోయబ్, మధు, అఖిల్, తదితరులు పాల్గొన్నారు.