Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీరిలో ముగ్గురు చిన్నారులే..
నవతెలంగాణ-కొత్తూరు
కరోనా థర్డ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయా.. అవుననే అనిపిస్తుంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే.. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం చిన్న పిల్లలపై పడనుందని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం సాగుతున్న విషయం విధితమే. మంగళవారం మండలంలో కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదు కాగా అందులో ముగ్గురు చిన్నారులే ఉన్నారు. హైదరాబాద్ చెందిన ఓ మహిళ వారి ఇంట్లో జరిగిన ఒక వేడుకలో పాల్గొని నాలుగు రోజుల కింద తన అమ్మగారి ఇల్లు కొత్తూరుకు చేరుకుంది. ఆవిడకు కరోన లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు. కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమె నుంచి ఇద్దరు పిల్లలకు కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో అప్రమత్తమైన మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో మండల వైద్యాధికారి డాక్టర్ కవిత తన వైద్య సిబ్బందితో కలిసి ఆమె ఉంటున్న నారాయణగూడ కాలనీలోని చుట్టుపక్కల ఉన్న 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా మండలంలోని ఇముల్ నర్వలో మరో ఇద్దరికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. వారిద్దరు భార్యాభర్తలు అని తెలిపారు. వీరి నుంచి వారి కూతురుకు కరోనా సోకినట్లు సిబ్బంది తెలిపారు. వీరు కూడా హైదరాబాద్‌లో నిర్వహించిన ఫంక్షన్లో పాల్గొనడం వల్లే కరోనా బారిన పడ్డారని వైద్యులు తెలిపారు.