Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలల రక్ష జిల్లా కో-ఆర్డినేటర్ శ్రీలక్ష్మి
నవతెలంగాణ-తాండూరు రూరల్
బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా బాలల రక్ష కో-ఆర్డినేటర్ శ్రీ లక్ష్మి అన్నారు మంగళవారం సర్పంచ్ అంగన్వాడీ పంచాయతీ కార్యదర్శులకు తాండూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బాలల పరిరక్షణ సమితిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 ఏండ్లు నిండని బాలికలకు వివాహం చేస్తే బాల్య వివాహాల చట్టం కింద నేరం అవుతుందని తెలిపారు. గ్రామస్థాయి లో బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతినెలా క్రమం తప్పకుండా మొదటి వారంలో గ్రామ స్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించాలని అన్నారు. ప్రతి గ్రామంలో 18 ఏళ్లు నిండని బాలికలకు 21 ఏండ్లు నిండని బాలురకు పెండ్లి చేయడం నేరమని అవగాహన కల్పించారు. పదవ తరగతి పూర్తి చేసిన ప్రతి బాలికను ఉన్నత చదువులు చదువుకో ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు ఆనంద్ కుమార్, మోన్యా నాయక్, తదితరులు పాల్గొన్నారు.