Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ పౌసమీ బసు
నవతెలంగాణ-దోమ
పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం పరిగి పట్టణంలో బందావన్ గార్డెన్స్‌లో జిల్లా కలెక్టర్ పౌసుమీ బసు అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారని అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో 37 మంది సానుకూలంగా మాట్లాడుతూ ఈ పథకం ద్వారా వన్య ప్రాణులకు, వక్ష సంపదకు, జంతు జాలాలకు ఎలాంటి హాని ఏర్పడదని వారు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నెరవేర బోతున్నందున ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇలాంటి ప్రాజెక్ట్ ల వల్ల భూగర్భ జలాలు పెరిగి తాగు, సాగునీరు లభించి ఈ ప్రాంత ప్రజలు, రైతులు ఆర్థికంగా అభివద్ధి చెందుతారని తెలిపారు. నీటి సౌలభ్యత వల్ల పరిశ్రమిక రంగం అభివద్ధి చెంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు తమ అభిప్రాయాలూ వ్యక్తపరిచారు. ఈ పథకం కింద భూములు, ఇండ్లు కోల్పోయిన భూ నిర్వాసితులకు, ఇండ్లు కోల్పోయిన వారికి ఇండ్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కుల్కచర్ల మండలంలోని కొన్ని గ్రామాలకు మాత్రమే నీరు అందనున్నందున, మిగితా అన్ని గ్రామ పంచాయతీలకు కూడా సాగు నీరందేలా చూడాలని కోరారు. వికారాబాద్ జిల్లాలో ఈ ప్రాజెక్ట్ కింద 18 మండలాల్లోని 417 గ్రామాల్లో ఉద్ధాండాపూర్, కేపీ లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ ద్వారా సుమారు 3,41,952 ఎకరాలకు సాగు నీరును ఉద్ధాండాపూర్ ప్రధాన ఎడమ కాలువ నుండి 16.550, సర్వే ప్యాకేజీ నాలుగు ద్వారా 1,20,000 ఎకరాలకు, మద్దూర్ కాలువ ద్వారా 80,400 ఎకరాలకు సాగు నీరు అందించనున్నట్టు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ పౌసుమి బసు మాట్లాడుతూ రైతులు, ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు విలువరించిన సానుకూల అభిప్రాయాలను వీడియో రికార్డింగ్ చేసినట్టు చెప్పారు. వీటితో పాటు కొందరు లిఖిత పూర్వక పత్రం అందించిన అభిప్రాయాలను కాలుష్య నియంత్రణ మండలి వారి ద్వారా కేంద్ర ప్రతి హత్వానికి పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు కాలుష్య నియంత్రణ మండలి ఎస్ఈ సురేష్, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్, జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, వికారాబాద్ డివిజన్ ఆర్డీవో ఉపేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.