Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
నవతెలంగాణ-షాద్ నగర్ రూరల్
బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె, పట్టణాల అభివద్ధికి కషి చేస్తున్నదని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. మంగళవారంనగర్ మండల పరిధిలోని లింగారెడ్డిగూడ గ్రామ పంచాయతీలో పలు అభివద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై సర్పంచ్ మాధవి రామకష్ణతో కలిసి అభివద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్మశాన వాటిక, పల్లె ప్రకతి వనం, గ్రామ పంచాయతీ సమావేశం భవనం, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్, వంశరాజ్ కమ్యూనిటీ హాల్ లను, ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివద్ధికి ప్రభుత్వం కషి చేస్తున్నదన్నారు. మంగళవారం ఉదయం ఫరూఖ్‌నగర్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు కషి చేస్తానని ఆయన తెలిపారు. గ్రామాల్లో డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలను, రైతు వేదికలను ఏర్పాటు చేసిందని, రాష్ట్ర సంక్షేమ పథకాలు, రైతుభీమా, రైతు బంధు వంటి అనేక సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. అన్నివర్గాల ప్రజల ఆర్థికాభివద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దష్టి సారించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఖాజా ఇద్రీస్, జడ్పీటీసీ వెంకట్ రాంరెడ్డి, ఎంపీటీసీ బిశ్వ రామకష్ణ, ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి, ఎంపీడీవో శరత్ బాబు, డిప్యూటీ ఈఈ రంజీవులు, ఎంఈవో శంకర్ రాథోడ్, వార్డుసభ్యులు, మండల అధ్యక్షుడు శోభలక్ష్మణ్ నాయక్, గ్రామ కమిటీ అధ్యక్షుడు లక్ష్మయ్య యాదవ్, నాయకులు మల్లేష్ యాదవ్, షరీఫ్, పోషయ్య, శశాంక్, నర్సింహ, బలరాం, కో-ఆప్షన్ సభ్యులు బొల్లు రామచంద్రయ్య, గోద చందు పాల్గొన్నారు.