Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెడికల్ అధికారి డాక్టర్ అంబిక అధికారులతో సమావేశం
నవతెలంగాణ-మర్పల్లి
ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన న్యూమోకల్ వ్యాక్సిన్ పిల్లలందరికీ వేయడంద్వారా ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి పిల్లలను కాపాడుకో వచ్చని పట్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ అధికారి డాక్టర్ అంబికా అన్నారు, మంగళవారం మం డల పరిషత్ కార్యాలయం హాలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్త వ్యాక్సిన్ గురించి వివరించారు. ఈ వ్యాక్సిన్ ద్వారా నిమోని యా పిల్లలలో ఊపిరితిత్తులకు సంక్రమించే వ్యాధి దీని వలన పిల్లలకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఛాతి ముడుచుకుపోవడం, దగ్గు, జ్వరం మొదలైనవి తీవ్రంగా ఉంటే పిల్లల మరణానికి కూడా దారి తీయ వచ్చని ఆమె అన్నారు. న్యూ మొబైల్ న్యూ మోకల్ వ్యాక్సిన్ 6 వారాలు, తర్వాత 9నెలల వయసులో ఇస్తారని తెలిపారు. ఏడాది లోపు పిల్లలందరికీ మూ డు మోతాదులు ఇచ్చి న్యూమోకల్ వ్యాధి నుంచి కాపా డవచ్చు అన్నారు. ఒక నెల 15 రోజులకు రెండవది, రెండు నెలల 15 రోజులకు మూడవది, తొమ్మిది నెలలకు ఇస్తారని తెలిపారు. ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా సరఫరా చేస్తున్నట్టు వివరించారు. పిల్లలకు కుడి తొడపై మధ్య భాగంలో ఇంట్రామస్కులర్ ద్వారా ఇంజక్షన్ ఇస్తారని పేర్కొన్నారు. టీకాలు వేసిన తర్వాత పిల్లలకు ఏదైనా దుష్ప్రభావాలు కలిగితే ఆఫీసర్‌కు తెలియజేయాలని, పిల్లలను సమీప ఆరోగ్య కేంద్రా లకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బట్టు లలిత రమేష్, ఎంపీడీవో వెంకట్రా మ్గౌడ్, వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, ఆర్ఐ గోపాల్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.