Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనార్హులను తొలగించాలి
- అవకతవకలకు పాల్పడితే చర్యలు డీఆర్డీఏ ఏపీఓ లక్ష్మి కుమారి
నవతెలంగాణ-మర్పల్లి
మండలంలో అర్హులైన వారికే పింఛన్లు ఇవ్వాలని డీఆర్డీఏ ఏపీఓ లక్ష్మి కుమారి అన్నారు. మంగళవారం ఏపీఎం కమలాకర్ తో కల్కూడ గ్రామంలో పింఛన్లు పంపిణీని తనిఖీ చేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాల యంలో ఎంపీడీవో వెంకట్ రామ్గౌడ్తో పింఛన్ల పంపిణీలో అవకతవకలపై చర్చిం చారు. చనిపోయిన వారి పేర్లను వెంటనే తొలగించాలని సూచించారు. ఫింగర్ ప్రింట్ రానివారికి కార్యదర్శుల ద్వారా సమయానికి పింఛన్లు అందించి ప్రతి నెలా అందరూ డబ్బులు పొందే విధంగా చూడాలన్నారు. వికలాంగులకు సర్టిఫికెట్ రెన్యువల్ టైం గడువులోగా ఫ్లాట్ బుక్ చేసి పింఛన్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సోమలింగం, తదితరులు ఉన్నారు.