Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోక్ సభలో కేంద్రాన్ని కోరిన చేవెళ్ళ ఎంపీ రంజిత్‌రెడ్డి
- కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ని కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి
- సానుకూలంగా స్పందించిన అనురాగ్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణలోని హైదరాబాద్‌లో రెండు దశాబ్దాల క్రి తం, 90 ఎకరాల్లో ఏర్పాటు చేసిన గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ని, ఒలంపిక్స్ నిర్వహించగల అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించాలని, ఇందుకు రూ.52 కోట్లు కేటాయించాలని చేవెళ్ల ఎంపీ జి.రంజిత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్ సభలో మంగళ వారం జీరో అవర్‌లో నోటీస్ అందజేశారు. దేశంలోని ప్రముఖ స్టేడియాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ గచ్చి బౌలి స్టేడియంలో ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్ కి అను వైన అన్ని సదుపాయాలు ఉన్నాయన్నారు. హాకీకి రెండు కోర్టులున్నాయని, ఈ స్టేడియంలో 32వ జాతీయ క్రీడలు, ఆఫ్రో అసియన్ గేమ్స్, వాల్డ్ మిలిటరీ గేమ్స్ నిర్వ హించినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ కార్యదర్శి రూ.52 కోట్ల అంచనాలతో కూడి ప్రతిపాదనలను కేంద్రా నికి పంపించారని గుర్తుచేశారు. ఒలంపిక్స్ స్థాయి క్రీడా కారులను తయారు చేయడానికి, అవసరమైతే ఒలంపిక్స్ నిర్వహించడానికి అనువుగా అన్ని సదుపాయాలతో గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ని తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇదే స్టేడియంలో చిన్నతనం నుంచి టెన్నిస్ క్రీడాకారిణి పి.వి సింధు ప్రాక్టీసు చేస్తూ ఉండేదని అయన గుర్తు చేశారు. అనంతరం కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ని కలిసి సాధ్యమైనంత తొందరగా నిధులు కేటాయించాలని కోరారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు.