Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదిన్నరగా గ్రామాల్లోకి రానీ బస్సులు
- పట్టణ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులకు తప్పని తిప్పలు
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 410 బస్సులు డిపోకే పరిమితం
- ప్రయివేటు వాహనాలను ఆశ్రయించడంతో ఆర్థిక భారం
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 1,752 బస్సులు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ రీజీయన్‌లో ఉన్న రంగారెడ్డిలో 1500 బస్సులు ఉన్నాయి. 1200 ఆర్టీసీ బస్సులు, 300 అద్దె బస్సులు ఉన్నాయి. వికారాబాద్ జిల్లాలో మొత్తం 252 బస్సులు ఉండగా 133 అద్దె బస్సులు, 118 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. 133 మాత్రమే నడుపుతు న్నారు. అద్దె బస్సులను పూర్తి స్థాయిలో నడుపకపోవడంతో గ్రామీణ ప్రాంతాలకు బస్సులు వెళ్లాడం లేదు. ప్రస్తుతం ప్రధాన రూట్లు మాత్రమే బస్సులు తిరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ రీజీయన్‌లో పూర్తిగా అద్దె బస్సులను నిలిపివేడయంతో రంగారెడ్డి జిల్లాలో పల్లెవెలుగు బస్సులు, సిటీ బస్సులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాడం లేదు.
రంగారెడ్డి జిల్లాలో షాద్‌నగర్ డిపోలో 110 బస్సులు ఉండగా ఏడాదిన్నరగా 40 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం రద్దీగా ఉండే రూట్లలోనే అరకొరగా నడుపుతున్న పరి స్థితి నెలకొంది. వికారాబాద్ డిపో పరిధిలో 78 బస్సు లు ఉండగా కరోనాకు ముందు 192 గ్రామాలకు బస్సులు నడిచేవి. కానీ ప్రసుత్తం 34 బస్సులు 132 గ్రామాలకే పరిమితం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల్లో ఇదే పరిస్థితి దాపురించింది. స్కూల్, కళాశాలలు మూసివేయడంతో ప్రస్తుతం గ్రా మాలకు బస్సులు నడపడం లేదని ఆర్టీసీ అధికారులు బదులిస్తున్నారు.
ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు
గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు పోవాలంటే రవాణా సౌకర్యం లేక ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా పంటల సాగు సీజన్ కావడంతో ఎరువులు, విత్తనాల కోసం పట్టణ ప్రాంతాలకు, మండల కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. సమయానికి బస్సులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు కూడా తిప్పలు తప్పడం లేదు. సోమవారం వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలంలో బస్సులు రాకపోవడంతో పదో తరగతి విద్యార్థి ఆటోలో పాఠశాలకు వెళ్లాడు. ఆ ఆటో ప్రమాదానికి గురికావడంతో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ప్రయివేటు వాహనాల్లో ప్రయాణిస్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాలకు బస్సులు నడపాలని ప్రజలు కోరుతున్నారు.
బస్సు సర్వీసును పునరుద్ధరించండి
రుద్రారం బస్సు సర్వీసును వెంటనే పునరుద్ధరిం చాలి. గతంలో బస్సు సర్వీసు ఉండడంతో రుద్రారం, టేకుల కోడు, అన్నారం, అంగడి రాయచూరు, గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది ఉండేది కాదు. ప్రస్తుతం ఈ సర్వీసును తొలగించడంతో ప్ర యాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నియోజకవర్గ కేంద్రానికి వెళ్లే ప్రజలు, ఆస్పత్రికి వెళ్లే రోగులకు, దూర ప్రాంతానికి వెళ్లే ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడేది. ప్రస్తుతం బస్సు లేదు. ఎలాంటి సర్వీసు లేకపోవడంతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రుద్రారం, నాగారం, టేకుల కోడు, అన్నారం, అంగడి రాయిచూర్ ప్రయాణికుల అవస్థను దృష్టిలో ఉంచుకొని బస్సు సర్వీసును పునరుద్ధరించాలి.
- ప్రకాష్ రాజ్, రుద్రారం