Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న చైర్పర్సన్ రేఖాయాదగిరి
నవతెలంగాణ-గండిపేట్
గ్రామదేవతలైన ఎల్లమ్మ, నల్లపోచమ్మ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ దార్గుపల్లి రేఖాయాదగిరి అన్నారు. బుధవారం నార్సింగి మున్సిపాలిటీలోని గౌలిదొడ్డిలో యేటా బోనాల ఉత్సవాల వేడుకలకు ముందుగా వార్షికోవత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సారి బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అమ్మవారికి కల్యాణం, పట్టు వస్త్రాలు, ఓడిబియ్యం, పసుపు, కుంకుమ వంటి ముడుపులు చెల్లించేందుకు సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు. శివారు అన్ని గ్రామాల్లో బోనాలు ముగిసిన తర్వాత గౌలిదొడ్డిలో నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, నాయకులు యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.