Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంషాబాద్
వారం రోజుల పాటు మండలంలోని వివిధ గ్రామాల పరిధిలో చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలపై శంషాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోపెంపీడీవో వినరు కుమార్ ఆధ్వర్యంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహత్ పల్లె ప్రకతి వనంలో మొక్కలు నాటడం, గ్రామాల్లో కూడళ్లలోనూ మొక్కలు నాటి నీరు అందించాలన్నారు. నీరు అందించే విధానంపై చర్చించారు. దీంతోపాటు గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు, ఈ మేరకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం పట్ల పలు అంశాలను పరిశీలించారు. రాజేంద్రనగర్ డీఎల్పీవో అన్నపూర్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ప్రతి ఒక్కరూ అమలు చేయాలన్నారు. నిబంధనల ప్రకారం మొక్కలు నాటి, పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తడి పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో మండల పంచాయతీ అధికారి సురేందర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి ఎన్ కవిత, ఏపీఎం జయమాలిని, కార్యదర్శులు పాల్గొన్నారు.