Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మండ్లి రాములు
నవతెలంగాణ-ఆమనగల్
పోలీసులతో ప్రజల పక్షాన కొనసాగే ప్రతిపక్ష పార్టీల పోరాటాలను ప్రభుత్వం అదుపుచేయలేదని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మండ్లి రాములు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం షాద్నగర్ నియోజకవర్గంలో మంత్రుల పర్యటనను పురస్కరించుకుని ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ, ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు భయపడి పోలీసులతో అరెస్టులకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. ఇలా ఎంత కాలం పోలీసులతో ఉద్యమాలను ఆపలేరని, సరైన సమయంలో కాంగ్రెస్ ప్రజా ఉద్యమాన్ని చేపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వస్పుల శ్రీశైలం, అలీం, వస్పుల శ్రీకాంత్, కష్ణయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపోగు మల్లేష్, బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.